పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు..
- November 19, 2025
పుట్టపర్తి: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రముఖ సినీ నటి ఐశ్వర్యారాయ్, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోపాటు పలువురు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంకు చేరుకున్న మోదీ.. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







