హరిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం రూపొందాలని చంద్రబాబు..
- July 25, 2016
విజయవాడ: రాష్ట్రంలో 50శాతం పచ్చదనం ఏర్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈనెల 29న 'వనం-మనం' కార్యక్రమం కింద కోటి మొక్కలు నాటే సంకల్పంలో 5కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం రూపొందాలని టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడిన చంద్రబాబు ఆకాంక్షించారు.విజయవాడలోని తన నివాసం నుంచి 4600 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని.. టీం లీడర్లు ఎప్పటికప్పుడు దాని పెరుగుదలను పరిశీలిస్తూ అన్ని మొక్కలను సంరక్షించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛందసంస్థల సహకారంతో వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్లాంటేషన్, పంట సంజీవని, సీసీ రోడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ గ్రామంలో పడిన వర్షపు నీరు అక్కడే భూగర్భంలోకి చేరేలా శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్‌లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్‌తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్‌లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!







