దుబాయ్ లో 210 మోటార్‌బైక్‌లు, స్కూటర్‌లు సీజ్..!!

- November 22, 2025 , by Maagulf
దుబాయ్ లో 210 మోటార్‌బైక్‌లు, స్కూటర్‌లు సీజ్..!!

యూఏఈ: దుబాయ్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 200 కి పైగా మోటార్‌సైకిళ్లు మరియు ఇ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా  ట్రాఫిక్ భద్రతా నిబంధనలను పాటించడం, రోడ్ల పై ప్రజా భద్రతకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. 

అలాగే, రోడ్డుపై ప్రమాదకరమైన డ్రైవింగ్ ప్రాక్టిస్ కు సంబంధించి 271 వాహన డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ ను అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com