8 లక్షలు పెట్టి కబాలి నంబరు కొనుక్కున్నారట!
- July 25, 2016
ఎంత డివైడ్ టాక్ వచ్చినా అభిమానుల్లో మాత్రం కబాలి ఫీవర్ ఇంకా తగ్గలేదు. రజనీకాంత్ వీరాభిమాని ఒకరు తన కారు మీద శాశ్వతంగా కబాలి ఉండిపోవాలని అనుకున్నారు. అందుకోసం కొత్త 'ఆడి' కారు కొన్నారు. అయితే, ఆయన ఉండేది తమిళనాడులోని ఒక పట్టణంలో. అక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తే టీఎన్ అనే సిరీస్ వస్తుంది. కబాలి పేరుతో కారు నెంబర్ కావాలని కర్ణాటక వెళ్లారు. అక్కడ ఎటూ కేఏ సిరీస్ వస్తుంది. అందులో కేఏ8ఏఎల్1 అనే నెంబరు కావాలని ముందుగా బుకింగ్ చేసుకున్నారు. ఆ నెంబరు వేలానికి వచ్చింది. తమ హీరో కోసం ఎంతయినా ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్న సదరు అభిమాని.. ఏకంగా 8 లక్షలు పెట్టి ఆ నంబరు కొనుక్కున్నారట. దాన్ని ఇంగ్లీషులో కేఏబీఏఎల్ఐ (కబాలి) అని వచ్చేలా రాయించుకున్నారు. పైన రజనీ బొమ్మ కూడా వేయించి, కబాలి అని మాత్రమే కనిపించేలా నంబర్ ప్లేటు వేసుకుని ఆయన తన ఆడి కారులో రాజసంగా తమిళనాడు వీధుల్లో తిరుగుతున్నారు. ఇది చూసిన తోటి అభిమానులు.. ముచ్చటపడి ఆ కారును వెనక నుంచి ఫొటో తీసి సోషల్ మీడియాలో మొత్తం విషయంతో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వాట్సప్, ఫేస్ బుక్ లలో వైరల్ గా వ్యాపిస్తోంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









