ఒమన్‌లోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు..!!

- November 23, 2025 , by Maagulf
ఒమన్‌లోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు..!!

మస్కట్: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఒమన్ ఆకర్షిస్తోంది. 'ఇన్వెస్ట్ ఒమన్' ప్లాట్‌ఫామ్ ద్వారా  నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించడంలో వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు విజయవంతం అయినట్లు ఒమన్ వాణిజ్య మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ ఇబ్తిసామ్ బింట్ అహ్మద్ అల్ ఫరూజీ వెల్లడించారు    

గత రెండు సంవత్సరాలలో ఆర్థిక సూచికలు ప్రభుత్వ సంస్కరణల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం 12 శాతానికి మించి వృద్ధి రేటుతో US$78 బిలియన్లకు పైగా పెరిగిందని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగంలో అత్యంత ప్రముఖ సంస్థల జాబితాలో ఒమన్ సుల్తానేట్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానానికి చేరిందని తెలిపారు.  

2026-2028 సంవత్సరాల్లో ఒమన్ సుల్తానేట్ గ్రీన్ హైడ్రోజన్, మెటల్ పరిశ్రమలు, అధునాతన సాంకేతికతలు, లాజిస్టిక్స్, ఆహార భద్రత మరియు పర్యాటక రంగాలలో పనిచేస్తున్న నాణ్యమైన కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోందని తెలిపారు. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి దోహదపడే నాణ్యమైన పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఒమన్ సాగుతోందని వాణిజ్య మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com