ఇంటర్నెట్‌ రెగ్యులేటింగ్‌ చట్టం అమల్లోకి

- July 25, 2016 , by Maagulf
ఇంటర్నెట్‌ రెగ్యులేటింగ్‌ చట్టం అమల్లోకి

వెబ్‌ ఆధారిత పబ్లికేషన్లు, ఎలక్ట్రానిక్‌ న్యూస్‌ సర్వీసులు, బులెటిన్లు, న్యూస్‌ పేపర్లకు చెందిన వెబ్‌సైట్లు, టెలివిజన్‌ వెబ్‌సైట్లు వంటివాటికి సంబంధించి రెగ్యులేషన్‌ కోసం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం నిన్నటినుంచి అమల్లోకి వచ్చింది. తీవ్రవాద భావజాలాన్ని అరికట్టడం కోసం అలాగే, ఆన్‌లైన్‌ మీడియా కువైట్‌ సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గట్టుగా పనిచేసేందుకు వీలుగా చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు ఇన్ఫర్మేషన్‌ మినిస్టర్‌ షేక్‌ సల్మాన్‌ అల్‌ హుమౌద్‌ అల్‌ సబా చెప్పారు. ఇంటర్నెట్‌ ఆధారిత సంస్థలు గవర్నమెంట్‌ నుంచి లైసెన్సులు పొందిన అనంతరమే ఆయా వెబ్‌సైట్లు లేదా న్యూస్‌ ఎజెన్సీలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించేవారికి చట్ట ప్రకారం చర్యలు తప్పవు. అయితే ఈ చట్టం వ్యక్తిగత అక్కౌంట్లు, బ్లాగర్స్‌కి వర్తించదు. చట్టాన్ని అతిక్రమిస్తే 10 ఏళ్ళ జైలు శిక్షకు గురవుతారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com