హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- November 26, 2025
హాంకాంగ్‌లో అతి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 13 మంది సజీవదహనమయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
హాంకాంగ్ ఉత్తర తై పోలోని అపార్ట్మెంట్ బ్లాక్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 28 మంది గాయపడ్డారని అధికారులు అంటున్నారు. మంటల వల్ల భారీ అపార్ట్మెంట్ల చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. అనేక మంది లోపల చిక్కుకున్నారని అక్కడి మీడియా తెలిపింది.
తై పోలోని వాంగ్ ఫుక్ కోర్ట్‌లో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగాయని ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం అందుకుంది. వాంగ్ ఫుక్ కోర్ట్ ఎనిమిది బ్లాకులతో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్ లో దాదాపు 2,000 నివాస యూనిట్లు ఉన్నాయి. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
హ్యారి చెయుంగ్ (66) అనే వ్యక్తి నాలుగు దశాబ్దాలకుపైగా ఆ కాంప్లెక్స్‌లోని బ్లాక్ 2లో నివసిస్తున్నారు. అతను మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చాలా పెద్ద శబ్దం విన్నానని, తమకు దగ్గరలోని బ్లాక్ లో మంటలు చెలరేగినట్లు చూశానని అన్నారు.
వెంటనే వెళ్లి నా వస్తువులు సర్దుకున్నాను అని చెప్పారు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ రాత్రి ఎక్కడ నిద్రపోతానో అని మాత్రమే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







