మ్యూజిక్ కంపోజర్స్ వివేక్ & మెర్విన్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

- November 26, 2025 , by Maagulf
మ్యూజిక్ కంపోజర్స్  వివేక్ & మెర్విన్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి.ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది.ఈ సందర్భంగా వివేక్ & మెర్విన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ మ్యూజిక్ జర్నీ గురించి చెప్పండి?ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
-మా ఇద్దరిదీ చెన్నై. మేము తమిళ్లో 20 సినిమాలు చేశాం. ఆంధ్ర కింగ్ తెలుగులో మా మొదటి సినిమా.
-2024లో రామ్ గారు మాకు కాల్ చేశారు. చాలా మంచి మ్యూజిక్ చేస్తున్నారని ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఒక నెల రోజులు తర్వాత ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు.అలా సినిమాల్లోకి వచ్చాం.

ఈ సినిమాల్లో మొత్తం ఎన్ని పాటలు ఉంటాయి?
-ఇప్పటివరకు నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకా మూడు పాటలు సినిమాలో ఉన్నాయి. కథలో చాలా కీలకమైన పాటలు అవి. అందుకే ఇప్పుడే రిలీజ్ చేయలేదు  సినిమా రిలీజ్ తర్వాత విడుదల చేస్తాం. ఇందులో ప్రతి పాట విజువల్ గా స్టన్నింగ్ గా ఉంటుంది.

-ఇందులో ప్రతిదీ మాకు ఫేవరెట్ సాంగ్.ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.ఇందులో ఆడియన్స్ ఒక రిట్రో సౌండ్ ని ఫీలవుతారు.  

-మేము ఈ సినిమాలో పాటలకి లిరికల్ గా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో ఈ పాటలన్నీ కూడా ఆడియన్స్ థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు

ఈ సినిమా జర్నీ ఎలా అనిపించింది?
-ఈ సినిమా మొత్తం మేము రామ్ గారితో చాలా క్లోజ్ గా జర్నీ చేసాం. అలాగే డైరెక్టర్ మహేష్ గారు కూడా ప్రతిక్షణం మా వెంట ఉన్నారు. మ్యూజిక్ ని చాలా ఆర్గానిక్ గా చేశాను. బేసిక్ గా అయితే ఒక ట్యూన్ ని కంపోజ్ చేసి ప్రొడ్యూసర్ కి సెండ్ చేస్తాము ఈ సినిమాకి మాత్రం అందరం ఒక రూమ్ లో కూర్చుని కంపోజ్ చేయడం జరిగింది.

రామ్ పాట రాశారు కదా అది ట్యూన్ కి రాశారా?
అవునండి.మేము ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేసాం. దానికి అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు.  

- రామ్ మ్యూజిక్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు.ఆయన మ్యూజిక్  సెన్స్ వండర్ఫుల్ గా ఉంటుంది.ఆయన అన్ని రకాల మ్యూజిక్స్ వింటారు.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినప్పటికే అన్ని సాంగ్ రికార్డింగ్స్ ని ఫినిష్ చేసాము.

బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది?
-ఇది చాలా యూనిక్ స్టోరీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా మేము చాలా కొత్త సౌండ్ ని ప్రయత్నించాము. సినిమా చూస్తున్నప్పుడు మీకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపుగా 30 థీమ్స్ ని క్రియేట్ చేసాము. సినిమా రిలీజ్ తర్వాత ఓఎస్టి ని రిలీజ్ చేస్తాం

మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్. రవి గారు నవీన్ గారి సపోర్ట్ ని మర్చిపోలేము. మ్యూజిక్ సెట్టింగ్స్ ని కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్లతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో భాగం కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము.

ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
-ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఈ సినిమాని ఇప్పటికే చూశారు. చూసిన వారందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు సినిమాని అప్రిషియేట్ చేశారు.

మీరు కొత్తగా చేయబోతున్న సినిమాలు గురించి?
-కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఈ సినిమాలో నువ్వుంటే చాలు పాట రిలీజ్ అయిన తర్వాత మాకు ఇండస్ట్రీ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

నువ్వుంటే చాలే పాట అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించారా?
-మేము మంచి పాట చేస్తున్నామని తెలుసు.రామ్ లిరిక్స్ రాయడం, అనిరుద్ ఆ పాట  పాడడంతో తప్పకుండా ఆ పాట ఆడియన్స్ కి నచ్చుతుందని అనుకున్నాము. ఆ పాట మా అందరికీ ఒక పర్సనల్ కనెక్షన్ లాగా ఏర్పడింది.  

మ్యూజిక్ విషయంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
-మేము ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వింటూ పెరిగాం.అలాగే ఇళయరాజా పాటలు ఇష్టం. అలాగే తెలుగు మ్యూజిక్ కూడా మాకు చాలా ఇష్టం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com