#NBK111 గ్రాండ్ గా లాంచ్
- November 26, 2025
వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు.సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది.
ఈ ప్రాజెక్టు నేడు హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు.బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ దర్శకులు, నిర్మాతలు అనేక మంది ప్రముఖ అతిథులు హాజరయ్యారు.
గోపిచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ రూపొందించే తన ప్రత్యేక మాస్ టచ్‌ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్ చూపించబోతున్నారు. స్పెషల్ పోస్టర్‌లో బాలకృష్ణ.. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్ పట్టుకుని అఖండమైన రాజసంతో కనిపించారు. గడ్డం, పొడవాటి జుట్టు, శక్తివంతమైన తీరుతో సమరశూరుడిలా అదరగొట్టారు.
హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది.
మిగిలిన తారాగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, నయనతార
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!







