ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- November 27, 2025
మస్కట్: ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) క్లారిటీ ఇచ్చింది.సుల్తానేట్ వెలుపల పనిచేస్తున్న లైసెన్స్ పొందిన మరియు లైసెన్స్ లేని టెలికమ్యూనికేషన్ కంపెనీల సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రజల ఆందోళనలపై స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
లైసెన్స్ పొందిన అన్ని టెలికమ్యూనికేషన్ కంపెనీలు ఒమన్‌లోని తమ ఉద్యోగుల ద్వారానే నేరుగా తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిర్వహించాలని TRA వెల్లడించింది. కొన్ని కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను షెడ్యూల్ చేయడానికి మరియు లింక్ చేయడానికి దేశం బయట నుంచి ప్రత్యేక డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నాయని, ఇకపై అన్ని కార్యకలాపాలు మరియు పర్యవేక్షణ పూర్తిగా ఒమన్ లోనే నిర్వహించాలని అథారిటీ స్పష్టం చేసింది.
TRA లైసెన్స్ పొందిన కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లు మరియు వ్యవస్థలను దేశంలోని ఆమోదించబడిన స్థానిక సంస్థల ద్వారా నిర్వహించాలని తెలిపింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాల్సిందేనని తన ఉత్తర్వుల్లో అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్







