సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!

- November 27, 2025 , by Maagulf
సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!

రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ఇళ్లకు ప్రాథమిక తాగునీటి సేవలు అందుతున్నాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ మేరకు హౌస్ హోల్డ్ ఎన్విరాన్ మెంటల్ 2024 గణంకాలను విడుదల చేసింది. 

ఈ నివేదిక ప్రకారం.. 99.8 శాతం ఇళ్లు సురక్షితమైన  తాగునీటి సేవల నుండి ప్రయోజనం పొందుతున్నాయి. అయితే సౌదీ జనాభాలో 47.3 శాతం మంది ఇప్పటికీ బాటిల్ వాటర్ తాగునీటికి ప్రధాన వనరుగా ఉంది. 36.5 శాతం మంది పబ్లిక్ నెట్‌వర్క్ నీటిని వినియోగించగా, ట్యాంకర్ నీరు 15.8 శాతం మంది వినియోగిస్తున్నారు. 

99.9 శాతం కుటుంబాలు ప్రాథమిక పారిశుధ్య సేవల నుండి ప్రయోజనం పొందుతున్నాయని, సురక్షితంగా నిర్వహించబడుతున్న పారిశుధ్య సేవలు 89.5 శాతానికి చేరుకున్నాయని గణాంకాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 59.3 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాలు 93.7 శాతం కవరేజ్ రేటును నమోదు చేశాయి. వ్యర్థాల నిర్వహణ పరంగా, 99.9 శాతం కుటుంబాలు ప్రాథమిక వ్యర్థాల సేకరణ సేవల సురక్షిత నిర్వహణ నుండి ప్రయోజనం పొందుతున్నాయని, 43.9 శాతం కుటుంబాలు ప్రతిరోజూ ఇంటి లోపల వ్యర్థాలను పారవేస్తున్నారని నివేదిక గణంకాలు చెబుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com