బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- November 27, 2025
మనామా: బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్ లాంటిదని ప్రధానమంత్రి కోర్టు మంత్రి మరియు ఇసా బిన్ సల్మాన్ ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా స్పష్టం చేశారు.
భవిష్యత్ సమాజాలను నిర్మించడంలో మరియు అభివృద్ధి చేయడంలో విద్య ఒక ప్రాథమిక మూలస్తంభంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సృజనాత్మకత, ఆవిష్కరణలను పెంపొందించడం మరియు మెరుగైన భవిష్యత్తును రూపొందించగల జాతీయ ప్రతిభను ప్రోత్సాహించడం ద్వారా దేశ భవిష్యత్ పై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఆయన వివరించారు. విద్యా విలువలను ప్రోత్సహించడం అనేది బహ్రెయిన్ పురోగతికి మద్దతు ఇచ్చే దీర్ఘకాలిక జాతీయ విద్యా విధానం అని హెచ్ హెచ్ షేక్ ఇసా చెప్పారు.
"నాలెడ్జ్ అండ్ గివింగ్ " అనే థీమ్‌తో ఇసా బిన్ సల్మాన్ ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ 2025 వార్షిక వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంతో పాటు జరిగిన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను కూడా హిస్ హైనెస్ షేక్ ఇసా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో కృషి చేసిన పలువురికి అవార్డులను హిస్ హైనెస్ షేక్ ఇసా అందజేశారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్







