పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!

- November 27, 2025 , by Maagulf
పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!

యూఏఈ: యూఏఈలో అనాథ పిల్లలను పోషించడానికి అర్హతను సవరించారు. ఎమిరాటీలు మరియు నివాసితులు ఇద్దరికి వర్తించేలా కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు.  2025 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 12 ప్రకారం.. తల్లిదండ్రులు తెలియని పిల్లల సంరక్షణను నియంత్రించే 2022 చట్టంలోని కీలక నిబంధనలను సవరించారు.     

సవరించిన ఆర్టికల్ 6 ప్రకారం.. పిల్లలను పెంచడానికి భార్యాభర్తలు యూఏఈలో రెసిడెన్సీ కలిగి ఉండాలి. కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి నేరారోపణలు ఉండకూడదు. పిల్లలను ప్రభావితం చేసేలా వ్యాధులు లేదా మానసిక సమస్యలు ఉండకూడదు.  పిల్లలను పోషించడానికి తగిన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించాలి.   

ఇక ఒంటరి మహిళల అర్హత పరంగా చూస్తూ.. ఒంటరి మహిళ తప్పనిసరిగా యూఏఈలో నివసిస్తు ఉండాలి. అవివాహితురాలు లేదా విడాకులు తీసుకున్న, వితంతువు అయినా ఫర్వలేదు. కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి.  ఎటువంటి నేరారోపణలు ఉండకూడదు. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి.  పిల్లలను పెంచే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి చట్ట ప్రకారం కస్టడీ బాధ్యతలను ఉపసంహరిస్తారని అధికారులు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com