ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- November 27, 2025
దోహా: ఏఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో సవాల్ విసురుతోంది. తాజాగా వైద్య రంగంలోనూ ఏఐ ఆధారిత కంపెనీల ప్రస్థానం వేగంగా పెరుగుతోంది. “ఒక వైద్య నిపుణుడు 950 దిర్హామ్‌లు వసూలు చేసే పనిని 10 దిర్హామ్‌లకు AI మీకు అందిస్తే, మీరు దానిని ఎందుకు ఎంచుకోరు?” అని యూఏఈకి చెందిన నబ్టా హెల్త్ వ్యవస్థాపకురాలు, సీఈఓ సోఫీ స్మిత్ ప్రశ్నించారు. దోహాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 (MWC25) లో వందలాది మంది టెక్ వ్యవస్థాపకులు, పరిశోధకులు మరియు పెట్టుబడిదారులు తమ ఆవిష్కరణలను పరిచయం చేసేందుకు ఒకే వేదికపై సమావేశమయ్యారు.
మిడిలీస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా కోసం కొత్త ఫ్లాగ్షిప్ గా MWC సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5G నుండి డిజిటల్ థెరప్యూటిక్స్ వరకు నెక్ట్స్ తరం జనరేషన్లను ప్రదర్శించారు. 4YFN స్టేజ్‌పై జరిగిన కీలక చర్చలలో AI-ఆధారిత ఆరోగ్య సంరక్షణపై కూడా చర్చ జరిగింది. ఇక్కడ స్మిత్ ప్రపంచ $2 ట్రిలియన్ డిజిటల్ హెల్త్ మార్కెట్‌ను మరియు MENA ప్రాంతంలో AI మరియు టెక్ ఆరోగ్య సంరక్షణను ఎలా పునర్నిర్మిస్తున్నాయో ప్యానెల్ చర్చలో పాల్గొని వివరించారు. తాము పేషంట్, డాక్టర్, ఏఐ కలిపి తుది దిశానిర్దేశం చేస్తామన్నారు. AI రోగ నిర్ధారణను వేగంగా మారుస్తుండగా, దాని తక్షణ ప్రభావం మానసిక ఆరోగ్యంపై, ముఖ్యంగా మనస్తత్వవేత్తలు మరియు సైకాలజిస్టుల కొరత ఉన్న ప్రాంతాలలో చాలా ఉపయోగంగా ఉంటుందని అన్నారు. స్పెషలిస్ట్ కేర్ ఆర్థికంగా లేదా భౌగోళికంగా అందుబాటులో లేకపోతే, AI ప్రత్యామ్నాయాన్ని అందించగలదని స్మిత్ నబ్టా పేర్కొన్నారు.
స్మిత్ నబ్టా హెల్త్ కు నాయకత్వం వహిస్తున్నారు.ఇది మిడిలీస్టులో AI-ఆధారిత మహిళా ఆరోగ్య సంస్థగా గుర్తింపు పొందింది. ఇటీవల టైమ్ మెగజైన్ ప్రపంచంలోని అగ్రశ్రేణి హెల్త్‌టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







