సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలు
- July 25, 2016
జపాన్లోని టోక్యోలో ఓ 26 ఏళ్ల యువకుడు కత్తితో అతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తాను పోలీసునంటూ చెప్పుకుంటూ నల్ల దుస్తులు ధరించి వికలాంగుల సౌకర్యార్ధం కేటాయించబడిన సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి విచక్షణ లేకుండా దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలయినట్టు తెలిసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 50 మందికి పైగా అతడి దాడిలో గాయపడ్డారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది.(భారత్ కాలమానం ప్రకారం) 2.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో ఇంటి బయట కనిపించినట్టు అక్కడి మీడియా నివేదించింది. అందిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







