'క్వాలిటీ ఆఫ్ లైఫ్' రేటింగ్‌లో ఒమన్ నంబర్ వన్..!!
- December 03, 2025
మస్కట్: నంబియో గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం, ఆసియా మరియు మిడిలీస్టులో ఒమన్ సుల్తానేట్ మొదటి స్థానాన్ని సాధించింది. గ్లోబల్ ప్లాట్ఫామ్లో వెల్లడించిన వివరాల ప్రకారం..జనాభా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ను నిర్ణయించారు.
ఒమన్ సుల్తానేట్ ప్రాంతీయ సూచికలో అత్యధిక స్కోరు 215.1 పాయింట్లను నమోదు చేసింది. తద్వారా GCC మరియు మిడిలీస్టు దేశాల కంటే ముందు నిలిచింది. ఖతార్ 189.4 పాయింట్లతో రెండవ స్థానంలో , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 174.2 పాయింట్లతో మూడు, సౌదీ అరేబియా 173.7 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా నగరాలు, దేశాలలో జీవన పరిస్థితులతోపాటు భద్రత స్థాయిలు, జీవన వ్యయాలు, ఆరోగ్య సేవల నాణ్యత మరియు వైద్యం వంటి ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. అదే సమయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







