అమరవీరులకు మోదీ ఘన నివాళి
- July 26, 2016
కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. ట్విట్టర్ వేదికగా వారి పరాక్రమాలను గుర్తుచేసుకున్నారు. దేశ రక్షణ కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అలాంటి వీరుల త్యాగం మనందరికీ ఆదర్శప్రాయమన్నారు.
భారత సైన్యం... పాక్ సేనలకు మరిచిపోలేని రీతిలో బుద్ధి చెప్పిందన్న మోదీ.. నాటి రాజకీయ నాయకత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్ని కొనియాడారు. భారత్‌లో పాక్ సైనికులు చొరబడేందుకు ప్రయత్నించడంతో.. 1999 మే నెలలో ఇరు దేశాల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. జులై 26న ముగిసిన ఈ యుద్ధంలో పాక్‌పై భారత సైనికులు ఘన విజయం సాధించడంతో ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్‌గా పేర్కొన్నారు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







