మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి

- July 26, 2016 , by Maagulf
మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి

కృష్ణా పుష్కరాల పనులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఏపీ కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ సాగింది. కృష్ణా పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల ఇవ్వకపోవడం సబబు కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ను రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ క్వింటాకు రూ.70 పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com