RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

- December 05, 2025 , by Maagulf
RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

ముంబై: ఇండియా (RBI) మళ్లీ గుర్తించింది. ఈ మూడు బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్నందున, వీటిని డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ (D-SIBs)గా వర్గీకరించింది. D-SIBగా గుర్తింపు పొందడం అంటే ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకుల కంటే మరింతగా రక్షణా ప్రమాణాలు పాటిస్తున్నాయన్న మాట. దేశంలో ఆర్థిక ఒత్తిడి వచ్చినా, గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలు పెరిగినా,ఈ బ్యాంకుల వ్యవస్థ మీద ప్రభావం పడే అవకాశాలు తక్కువ. దీనివల్ల ఖాతాదారుల డబ్బు మరింత భద్రంగా ఉండేలా RBI చూస్తుంది.

RBI నియమాల ప్రకారం, ఈ బ్యాంకులు కామన్ ఈక్విటీ టియర్-1 (CET1) కింద నిర్దిష్ట స్థాయిలో అదనపు మూలధనాన్ని నిర్వహించాలి. ఈ క్యాపిటల్ బఫర్ వల్ల ఆకస్మిక ఆర్థిక సమస్యలు, నష్టాలు, మార్కెట్ మార్పులు వచ్చినా కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. CET1 వంటి కఠిన ప్రమాణాలు ఈ మూడింటినీ సాధారణ బ్యాంకుల కంటే మరింత శక్తివంతంగా నిలబెడతాయి. ఏవైనా ఆర్థిక కుదుపుల్లోనూ రుణాలు, డిపాజిట్లు, ట్రాన్సాక్షన్లు, దినసరి కార్యకలాపాలు నిరంతరంగా సాగుతాయి. ఈ కారణంగానే RBI వీటిని “విఫలమవ్వకూడని బ్యాంకులు” (Too Big To Fail)గా పరిగణిస్తుంది. ఈ గుర్తింపు వినియోగదారులకు భద్రతపై నమ్మకం, పెట్టుబడిదారులకు వ్యవస్థపై విశ్వాసం, దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత అందిస్తుంది.

SBI, HDFC, ICICI బ్యాంకులు రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, డిజిటల్ సేవలు, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వంటి రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తృత ప్రభావం కలిగి ఉన్నాయి. దేశవ్యాప్త పెట్టుబడులు, అంతర్జాతీయ లావాదేవీలు, ప్రజాధనం భద్రత—ఇవి అన్నీ వారి స్థిరత్వంతో ఘనంగా ముడిపడి ఉన్నాయి. వారి స్థిర పునాదులు, అధిక క్రమశిక్షణతో కూడిన క్యాపిటల్ నిర్వహణ, సాంకేతిక దృష్టి, విశ్వసనీయత భారత ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రధాన కారణాలలో ఒకటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com