పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం

- December 05, 2025 , by Maagulf
పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాబట్టే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.గత పాలకుల నిర్ణయాల వల్ల సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు, అక్కడి సంస్థలు అనవసర ఇబ్బందులు పడ్డాయని ఆయన విమర్శించారు.ఆ చెడు ఇమేజ్‌ను పూర్తిగా తొలగిస్తూ, రాష్ట్రానికి విశ్వసనీయతను తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విశ్వసనీయ వాతావరణం ఏర్పడడంతోనే అంతర్జాతీయ కంపెనీలు APలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని సీఎం తెలిపారు.

తాజాగా కుదిరిన MOUలన్నీ 45 రోజుల్లోనే గ్రౌండ్ లెవెల్‌కు రావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని, సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా భూ సేకరణలో వివాదాలు తలెత్తకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. భూములు ఇచ్చేవారూ, కొనేవారూ రెండువర్గాలూ సంతుష్టిగా ఉండేలా విధానం రూపొందించాలని సూచించారు.

APలో సావరిన్ ఫండ్ ఏర్పాటు–పెట్టుబడి వాతావరణానికి బూస్ట్
దుబాయ్,యూఏఈ మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ₹500 కోట్ల సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రకటించారు.ఈ ఫండ్ ద్వారా పెద్ద ప్రాజెక్టులకు అవసరమైన ప్రారంభ మూలధనాన్ని ప్రభుత్వం అందించగలదు. విదేశీ నిధులు, పెద్ద కంపెనీలను ఆకర్షించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, IT, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావడమే కాక, యువతకు ఉద్యోగాలు సృష్టించడంలో కూడా ఇది ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని స్పష్టమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com