ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- December 07, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో 42వేలకుపైగా వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాణిజ్య లైసెన్సుల డేటాను అప్డేట్ చేయడంతోపాటు మార్కెట్ పారదర్శకతను పెంచే చర్యలో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఉనికిలో లేనివి, లైసెన్సు గడువు ముగిసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖలోని వాణిజ్య డైరెక్టర్ జనరల్ నస్రా బింట్ సుల్తాన్ అల్ హబ్సి తెలిపారు.
ఆయా వాణిజ్య రికార్డులను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత రద్దు ప్రక్రియ జరిగిందని అన్నారు. చట్టపరమైన విధానాలకు అనుగుణంగా రద్దు చేసిన రిజిస్ట్రేషన్ల జాబితాలను 30 రోజుల పాటు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
మొదటి దశలో 1970 నుండి 1999 వరకు ఉన్న 3,410 రికార్డులను రద్దు చేశారు. రెండవ దశలో 2000 నుండి 2020 వరకు 35వేల రికార్డులను తొలగించారు. మూడవ దశలో 1,116 రికార్డులను, చివరి దశలో మార్చి మరియు నవంబర్ 2025 మధ్య 2,638 రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







