నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- December 07, 2025
కువైట్: నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని కువైట్ ఇంటిరియర్ మినిస్ట్రీ హెచ్చరిక జారీ చేసింది. ఫోటోలు, లోగోలు, చిహ్నాల ద్వారా నార్కొటిక్ పధార్థాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహించే ఏవైనా వస్తువులను కలిగిఉండటం లేదా ఉపయోగించడం, ప్రదర్శించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించిన వారికి KD 500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇక మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాల వినియోగదారులతో కలిసి ఉన్న వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, KD 5,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందరూ కచ్చితంగా నిబంధనలను పాటించాలని మరియు ఏదైనా ఉల్లంఘనలను అధికారిక మార్గాల ద్వారా నివేదించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







