రియాద్ లో 43 ప్రైవేట్ ఆసుపత్రులు ఉల్లంఘనలకు పాల్పడటంతో మూసివేత

- July 26, 2016 , by Maagulf
రియాద్ లో 43 ప్రైవేట్ ఆసుపత్రులు ఉల్లంఘనలకు పాల్పడటంతో  మూసివేత

రియాద్​: గత రెండు నెలల్లో రాజధాని లో  43 ప్రైవేటు వైద్య సముదాయాలు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడటంతో మూసివేశారు.
రియాద్ ప్రాంతంలోని ప్రైవేటు ఆరోగ్య సేవల ముఖ్యులు  సాలెహ్ అల్ జుగ్హైబి తెలిపిన వివరాల ప్రకారం , అక్కడ కనిపించే అక్రమాలని పరిశీలించిన  ఒక ప్రత్యేక కమిటీ నిర్ణయం ప్రకారం అవి  మూతపడ్డాయి.చట్టవిరుద్ధంగా వృత్తి సాధన చేస్తూ  అవసరమైన లైసెన్స్ కలిగి లేకుండా తీవ్రమైన ఉల్లంఘనలు పాల్పడినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లైసెన్స్లు లేకుండా  చర్మ నిపుణులు,  సౌందర్య సాంకేతిక నిపుణులను అక్కడ  నియమించు కున్నారని తెలిపారు.  సిబ్బంది సమక్షంలోనే , మరియు  కనీసం వేడి నీటితోనైనా కడగకుండా  స్టెరిలైజేషన్ చేయని స్థితిలో పనిముట్లు ఉన్నాయని అన్నారు. సరైన విద్యార్హత లేని సిబ్బంది తో అధిక బరువు తగ్గించే విధానం ( లిపోసక్షన్ ) శస్త్ర చికిత్సలు చేస్తున్నారని తెలిపారు. ప్రముఖ సంస్థలు 38 కంటి  దుకాణాలు మరియు 21 మందుల దుకాణాలకు  లైసెన్సుల లేవని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com