మైనర్‌ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

- December 08, 2025 , by Maagulf
మైనర్‌ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

న్యూజిలాండ్‌ లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్‌ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది.ఇక వివరాల్లోకి వెళ్తే.. సత్వీందర్ సింగ్ అనే వ్యక్తి గత 11 ఏళ్ల నుంచి న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు.అతడు క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే 2023లో ఓ మైనర్ ప్రయాణికురాలు రాత్రిపూట అతడి క్యాబ్‌ను బుక్ చేసుకుంది.

సత్వీందర్ సింగ్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు.దారిలో వెళ్తుండగా జీపీఎస్‌ను ఆఫ్‌ చేశాడు. కారు రూట్‌ మార్చి వేరే చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి దగ్గర వదిలేశాడు. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలతో పరిశీలించారు. అనంతరం సత్వీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఈ కేసుపై అక్కడి కోర్టు విచారణ జరిపింది.సత్వీందర్‌ సింగ్‌ను దోషిగా తేల్చి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com