సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!

- December 08, 2025 , by Maagulf
సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఇల్లీగల్ రైడ్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇల్లీగల్ రైడ్ కు పాల్పడుతు లాస్ట్ వీక్ లో 1,278 మంది  ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తనిఖీ టీములకు దొరికిపొయారు.  

అలాగే, లైసెన్స్ లేకుండా ప్రయాణీకుల ట్రాన్స్ పోర్టు సేవలు అందిస్తున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్ లేకుండా తమ ప్రైవేట్ వాహనాలను ఉపయోగించి ప్రయాణీకులను తీసుకెళుతున్న 586 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇక పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతూ దొరికిన వారికి SR11,000 వరకు ఫైన్ తోపాటు 25 రోజుల పాటు వారి వెహికిల్స్ ను సీజ్ చేస్తామన్నారు.  ఇక లైసెన్స్ లేకుండా ట్రాన్స్ పోర్ట్ సేవలు అందిస్తున్న వారిపై గరిష్టంగా SR20,000 జరిమానా మరియు 60 రోజుల వరకు వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇలా దొరికిన వారిలో సౌదీలు కాని వారు ఉంటే, వారిని సౌదీ నుంచి బహిష్కరిస్తామని అధికారులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com