ఇకనుండి కొత్త తరహా లో 3డీ సినిమాలు
- July 26, 2016
3డీ సినిమాలను థియేటర్లో చూడాలంటే 3డీ కళ్లద్దాలు తప్పనిసరి. అయితే చాలా మంది వాడటంతో వీటిపై గీతలు, మరకలు పడుతూ ఉంటాయి. ఈ కారణంగా వీటిని పెట్టుకొని సినిమా చూడటం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా తొలిసారిగా గ్లాసెస్ లెస్ 3డీ డిస్ప్లే సాంకేతికతను రూపొందించారు ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ పరిశోధకులు. ఈ సాంకేతికతతో థియేటర్లో ఎక్కడ కూర్చున్నా కళ్లద్దాలు పెట్టుకోకుండానే 3డీ అనుభూతిని పొందవచ్చు.
ఇప్పటికే గ్లాసెస్ ధరించకుండా 3డీ చిత్రాలను వీక్షించే సాంకేతికత కొంత అందుబాటులో ఉంది. అయితే సింగిల్ యూజర్‌ను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారు. ఇందులో అతను తెరను చూసే దృష్టి కోణం మారదు. అయితే సినిమా థియేటర్లో వందల మంది ప్రేక్షకులు వివిధ సీట్లలో కూర్చొని వివిధ కోణాల్లో సినిమా చూడటానికి ఇలాంటివి పనిచేయవు.
ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(సీఎస్ఏఎల్) శాస్త్రవేత్తలు తొలిసారిగా థియేటర్లో 3డీ గ్లాసెస్ అవసరం లేకుండానే 3డీ సినిమా చూసే వీలున్న తెరను రూపొందించారు. 'సినిమా 3డీ' అని పిలిచే ఈ తెరపై ప్రత్యేకంగా అమర్చిన ఆప్టిక్స్, లెన్స్‌లు, అద్దాలు ఉంటాయి. ఈ సిస్టమ్ థియేటర్లో కూర్చొన్న ప్రేక్షకులకు అన్ని కోణాల్లో దృశ్యాన్ని చేరవేసి 3డీ అనుభూతిని కలిగిస్తుంది. అయితే గ్లాసెస్ లెస్ 3డీ సిస్టమ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని.. ఓ నమూనాను తయారు చేసి పరిశోధనలు చేస్తున్నామనిపరిశోధకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







