భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- December 09, 2025
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. అమోరి, హొక్కైడో తీరంలో భూకంపం వచ్చింది. సముద్ర ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ భారీ భూకంపం కారణంగా ప్రమాదకరమైన సునామీ తరంగాలు జపాన్, రష్యా తీరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. భూకంప కేంద్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా విధ్వంసకర అలలు వచ్చే ప్రమాదం ఉందంది. హొక్కైడోకు చెందిన ఒక వ్యక్తి ఈ భారీ భూకంపం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
భూకంపం వచ్చిన కాసేపటికే హొక్కైడోలోని ఉరకావా, అమోరిలోని ముత్సు ఒగవారా తీరాల్లో 40 సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
కాగా, ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న ఈ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. దీంతో ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. మార్చి 2011లో ఇదే ప్రాంతంలో భారీ భూకంపం, సునామీ సంభవించి వేలాది మంది మరణించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







