అఖండ 2 రిలీజ్‌కు లైన్ క్లియర్..
- December 09, 2025
అఖండ 2 రిలీజ్‌కు లైన్ క్లియర్..
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ -2 చిత్రం రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్ర విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 11నే ప్రీమియర్స్‌ను ప్రదర్శించబోతున్నారు.
వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉంది. అయితే.. 14 రీల్స్, ఈరోస్ సంస్థల మధ్య వున్న ఆర్ధిక వివాదం కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ విషయాన్ని కోర్టుకు నివేదించగా.. రిలీజ్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త కథానాయిక. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వస్తుండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







