ఓటీటీలోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’
- December 13, 2025
చిన్న సినిమాగా విడుదలై, థియేటర్లలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ హార్ట్ టచింగ్ మూవీని చూసిన చాలా మంది ప్రేక్షకులు, ముఖ్యంగా యువత, కన్నీళ్లతో బయటకు వచ్చారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ రూ.17 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 19 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా (Khammam) ఇల్లెందులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రంలో అఖిల్ రాజ్ మరియు తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా అయినప్పటికీ, తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. ఈ సినిమాకు నవంబర్ 21న విడుదలైన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది.
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో నటించి బాగా భయపెట్టారు, ఈ సినిమాలో అతని నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాను డాక్టర్ నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్‌లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. శివాజీ రాజా, అనిత చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా, సురేష్ బొబ్బలి సంగీతం అందించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







