కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- December 13, 2025
కువైట్: కువైట్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ యొక్క వాతావరణ విభాగం గురువారం కువైట్‌లోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు వర్షపాత రికార్డులను నమోదు చేసింది.అల్-అబ్దాలీలో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అల్-జహ్రాలో అత్యల్పంగా 5.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఎగువ వాతావరణంలో ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయని తెలిపారు. అల్-అబ్దాలీలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అల్-రబియాలో 10.9 మి.మీ, అల్-అబ్రాక్ ఫార్మ్‌లో 10.1 మి.మీ వర్షపాతం నమోదైంది.
రాస్ అల్-సల్మియాలో 9 మి.మీ, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8.4 మి.మీ మరియు అల్-వఫ్రాలో 8.3 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తాత్కాలిక డైరెక్టర్ ధిరార్ అల్-అలీ తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







