యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- December 14, 2025
యూఏఈ: యూఏఈలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని ఫుడ్ మరియు కిరాణా డెలివరీ సేవలు కొన్ని ప్రాంతాలలో ఆలస్యం కావడం లేదా నిలిపివేశయడం జరుగుతుంది. అదే సమయంలో ఫుడ్ డెలివరీ కంపెనీలు తమ డెలివరీ కార్మికుల భద్రతను నిర్ధారించడానికి కొన్ని ఆర్డర్లు రద్దు కూడా చేస్తున్నట్లు అలెర్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి.
డెలివరీ కంపెనీ తలాబత్ తమ రైడర్ల భద్రతను పురస్కరించుకొని, డెలివరీలలో జాప్యం లేదా ఆలస్యం జరుగుతుందని తెలిపింది. మరొక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ డెలివరూ, కస్టమర్లు పరిమిత స్థాయిలోనే ఆర్డర్లను చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
యూఏఈ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాలలో, తీరప్రాంతంలో మరియు ఉత్తర ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) విభాగం తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







