తమను జంతువుల్లా ట్రీట్ చేయడం మానుకోవాలని జాకబ్ లడ్డా..

- July 27, 2016 , by Maagulf
తమను జంతువుల్లా ట్రీట్ చేయడం మానుకోవాలని జాకబ్ లడ్డా..

అమెరికాలో నల్లజాతీయులను పోలీసులు కాల్చేసిన ఘటనలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మిన్నెసోటాలోని సెయింట్ పాల్ లో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుమారు 40 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో గవర్నర్ నివాసానికి సమీపంలో రోడ్డును మూసివేసి ఆందోళనకారులు నిర్వహిస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు.జులై 7న ఫిలాండ్ కాసిల్ అనే నల్లజాతీయుడిని పోలీసు అధికారి సెయింట్ ఆంథోనీ కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫిలాండో కాసిల్ గర్ల్ ఫ్రెండ్ ఈ ఘటనను రికార్డ్ చేసింది. అప్పటి నుంచి ఆందోళనకారులు.. సెయింట్ పాల్ లో గవర్నర్ నివాసం వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ ల సందర్భంగా తమను జంతువుల్లా ట్రీట్ చేయడం మానుకోవాలని నల్లజాతి నిరసనకారుడు జాకబ్ లడ్డా పేర్కొన్నారు. అకారణంగా ఓ వ్యక్తిని చంపేశారని, ఈ ఘటనలో న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com