విశాఖ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా కుప్పకూలిన భవనం

- July 27, 2016 , by Maagulf
విశాఖ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా కుప్పకూలిన భవనం

విశాఖ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా శిథిలావస్థలో ఉన్న భవనంలోని ఓభాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఇంటి కింది భాగంలో నలుగురు వృద్ధులు ఉన్నారు. ఇల్లు కూలుతోందని గమనించి బయటకు పరుగులు తీశారు. జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సాయంత్రానికి భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని తెలిపారు. వన్‌టౌన్‌ ఏరియా పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటినీ కూల్చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ నగరంలో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో శిథిల భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com