ప్రయాణికులు లోపలుండగానే విమాన మరమ్మతులు..
- July 27, 2016
రెండున్నర గంటలపాటు నిలిచిపోయిన విమానం ప్రయాణికులు లోపలుండగానే మరమ్మతులుగోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
హైదరాబాదు నుంచి విశాఖకు స్పైస్‌జెట్ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఇంతలో విమానానికి సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పెలైట్ అప్రమత్తమయ్యారు.తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేశారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమై విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వెళ్లారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







