త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం
- July 27, 2016
త్వరలో కొత్త జనరేషన్ ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పలు భద్రత అంశాలను మెరుగుపరిచి, బయోమెట్రిక్ వివరాలతో కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తామని ఈరోజు లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ-పాస్‌పోర్ట్ అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. దీంతో నకిలీ పాస్‌పోర్ట్‌లు తగ్గుతాయని అన్నారు. సాధారణంగా పాస్‌పోర్ట్‌లో ప్రింట్ చేసి ఉండే సమాచారమంతా ఈ-పాస్‌పోర్ట్‌లో ఎలక్ట్రానిక్ చిప్‌లో భద్రపరుస్తామని చెప్పారు. త్వరలోనే పౌరులకు ఈ తరహా పాస్‌పోర్ట్‌లు జారీ చేసేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









