శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం

- December 29, 2025 , by Maagulf
శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం

తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనానికి గోవింద నామస్మరణతో భక్తితో తిరుమలకు నడచుకుని వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అలిపిరి నడకమార్గంలో ఏడోమైలు వద్ద ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని టిటిడి (TTD) ఏర్పాటు చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఆదివారం ఉదయం టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ప్రారంభించారు. నడకదారి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ప్రాధమిక చికిత్సా కేంద్రం నెలకొల్పడంతో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ప్రాథమిక చికిత్సా కేంద్రం భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతిరోజూ ఈ మార్గంలో 30వేల వరకు భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు.వారికి ఏదేని అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్యసహాయం పొందవచ్చని చౌదరి చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, టిటిడి సిఎంఒ డాక్టర్ బి.కుసుమకుమారి, మెడికల్ అధికారిణి డాక్టర్ ఎస్.కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com