అల్ సుడాన్ బస్ స్టేషన్‌లో రవాణా సేవలు అప్డేట్..!!
- December 29, 2025
దోహా: ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌లో అల్ సుడాన్ బస్ స్టేషన్ సర్వీసులను ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MoT) అప్డేట్ చేసింది.ఈ మేరకు తన అధికారిక X పోస్ట్ లో తెలిపింది. కీలక పట్టణ మార్గాల్లో ఇది ఒకటని, గంటకు 22 బస్సుల సామర్థ్యం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ విస్తృత పబ్లిక్ బస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ మేరకు మౌలిక సదుపాయాలను అప్డేట్ చేసినట్లు వెల్లడించారు.
అల్ వాబ్ స్ట్రీట్ నుండి నేరుగా చేరుకోగల అల్ సుడాన్ ప్రాంతంలో ఉన్న ఈ స్టేషన్, గోల్డ్ లైన్‌లోని దోహా మెట్రో అల్ సుడాన్ స్టేషన్‌కు మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ స్టేషన్ నాలుగు కీలక మార్గాలలో సేవలు అందిస్తుందన్నారు. రోజుకు 1,750 మంది ప్రయాణికులు వివిధ బస్సుల్లో ప్రణాణిస్తున్నారని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
మరోవైపు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, ఎయిర్ నాణ్యతను మెరుగుపరచడానికి ఖతార్ వ్యూహంలో కేంద్ర భాగం అయిన జీరో-ఎమిషన్ పబ్లిక్ బస్సులకు మారడానికి మద్దతు ఇవ్వడానికి సైట్‌లో మూడు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అల్ సుడాన్‌లో ఎలక్ట్రిక్-ఛార్జింగ్, మౌలిక సదుపాయాల విస్తరణ జరిగిందని వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్‌లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్







