తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- December 29, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు పోలీసు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించింది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. మరోవైపు పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు, మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా రమేశ్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష యాదవ్ ను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్ గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్ పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేసి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని ప్రభుత్వం నియమించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







