సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!

- December 30, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!

రియాద్: సౌదీ అరేబియాలో సైబర్ క్రైమ్ ను అడ్డుకునేందుకు మరో సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. జాతీయ సైబర్ భద్రతా సంస్థ “తహ్కాక్” సేవను ప్రారంభించింది. అనుమానస్పద లింక్‌ల  విశ్వసనీయతను తక్షణమే ధృవీకరించడానికి ఈ సర్వీస్ వీలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు. “తహ్కాక్” ఈ సర్వీస్ ద్వారా  సర్క్యులేట్  లింక్‌లను చెక్ చేసుకోవచ్చని తెలిపింది.  అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయడం వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో ఈ సర్వీస్ సహాయపడుతుందని అధికార సంస్థ పేర్కొంది.

ఈ సేవ సైబర్ ప్రమాదాలను తగ్గిస్తుందని, సమాజంలో సైబర్ భద్రతా అవగాహనను పెంచుతుందన్నారు. "తహ్కాక్" సేవను నేషనల్ పోర్టల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ (హసీన్)లో భాగంగా సౌదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ (SITE) భాగస్వామ్యంతో అందిస్తున్నారు. ఈ సేవ వాట్సాప్ (+966118136644)ద్వారా, అలాగే హసీన్ పోర్టల్ వెబ్‌సైట్ http://tahqaq.haseen.gov.sa ద్వారా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com