అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!

- December 30, 2025 , by Maagulf
అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!

కువైట్: కువైట్ లోని ప్రముఖ చేపల మార్కెట్ ను అల్-ముబారకియా నుండి తరలించారు.చేపల మార్కెట్‌ను తరలించడం అనేది దీర్ఘకాలంగా ఉన్న సమస్య అని మున్సిపల్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మరియు గృహనిర్మాణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్-మషారీ తెలిపారు. చుట్టుపక్కల పర్యావరణంపై, సందర్శకుల రాకపోకలపై మార్కెట్ చూపే ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలో ఇది ఒక భాగమని ప్రకటించారు. అల్-ముబారకియా మార్కెట్‌లో జరిగిన జాతీయ పరిశ్రమల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు. చేపల మార్కెట్‌ను తరలించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయినట్లు అల్-మషారీ పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్ మున్సిపాలిటీ బదిలీ ప్రక్రియలను కొనసాగిస్తోందని ఆయన తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com