దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్‌ ఫ్రీ..!!

- December 30, 2025 , by Maagulf
దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్‌ ఫ్రీ..!!

దుబాయ్: దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని జనవరి 1వ తేదీన ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ప్రకటించారు. జనవరి 2 నుండి పార్కింగ్ రుసుములు తిరిగి అమలులోకి వస్తాయని రోడ్లు మరియు రవాణా అథారిటీ వెల్లడించింది. అదే విధంగా, రూట్ E100 డిసెంబర్ 31 మధ్యాహ్నం నుండి అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి తన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. చివరిట్రిప్ అబుదాబి నుండి మధ్యాహ్నం 12 గంటలకు మరియు అల్ ఘుబైబా నుండి మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందని తెలిపింది. జనవరి 4 వరకు సేవలు నిలిపివేయబడతాయని ప్రకటించింది.  ఈ సమయంలో అబుదాబికి ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్న్ బత్తూటా బస్ స్టేషన్ నుండి రూట్ E101ని ఉపయోగించాలని సూచించింది.  రూట్ E102 డిసెంబర్ 31న మధ్యాహ్నం 2 గంటల నుండి రోజు చివరి వరకు ఇబ్న్ బత్తూటా బస్ స్టేషన్ నుండి నడుస్తుందని తెలిపింది.
నూతన సంవత్సర వేడుకలకు అనుగుణంగా రెడ్ మరియు గ్రీన్ లైన్‌లలో దుబాయ్ మెట్రో సేవలు దాదాపు 43 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తాయి. రైళ్లు డిసెంబర్ 31న ఉదయం 5 గంటల నుండి జనవరి 1న రాత్రి 11.59 గంటల వరకు ఎటువంటి అంతరాయం లేకుండా నడుస్తాయని ప్రకటించారు.   దుబాయ్ ట్రామ్ సేవలు కూడా డిసెంబర్ 31న ఉదయం 6 గంటల నుండి జనవరి 1న తెల్లవారుజామున 1 గంట వరకు నడుస్తాయని తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com