దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- December 30, 2025
దుబాయ్: దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని జనవరి 1వ తేదీన ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ప్రకటించారు. జనవరి 2 నుండి పార్కింగ్ రుసుములు తిరిగి అమలులోకి వస్తాయని రోడ్లు మరియు రవాణా అథారిటీ వెల్లడించింది. అదే విధంగా, రూట్ E100 డిసెంబర్ 31 మధ్యాహ్నం నుండి అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి తన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. చివరిట్రిప్ అబుదాబి నుండి మధ్యాహ్నం 12 గంటలకు మరియు అల్ ఘుబైబా నుండి మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందని తెలిపింది. జనవరి 4 వరకు సేవలు నిలిపివేయబడతాయని ప్రకటించింది. ఈ సమయంలో అబుదాబికి ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్న్ బత్తూటా బస్ స్టేషన్ నుండి రూట్ E101ని ఉపయోగించాలని సూచించింది. రూట్ E102 డిసెంబర్ 31న మధ్యాహ్నం 2 గంటల నుండి రోజు చివరి వరకు ఇబ్న్ బత్తూటా బస్ స్టేషన్ నుండి నడుస్తుందని తెలిపింది.
నూతన సంవత్సర వేడుకలకు అనుగుణంగా రెడ్ మరియు గ్రీన్ లైన్లలో దుబాయ్ మెట్రో సేవలు దాదాపు 43 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తాయి. రైళ్లు డిసెంబర్ 31న ఉదయం 5 గంటల నుండి జనవరి 1న రాత్రి 11.59 గంటల వరకు ఎటువంటి అంతరాయం లేకుండా నడుస్తాయని ప్రకటించారు. దుబాయ్ ట్రామ్ సేవలు కూడా డిసెంబర్ 31న ఉదయం 6 గంటల నుండి జనవరి 1న తెల్లవారుజామున 1 గంట వరకు నడుస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







