శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- December 30, 2025
తిరుమల: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీలో గత అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా నిన్న ఒక్కరోజే దాదాపు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని ఆయన తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం 3 గంటల పాటు మాత్రమే ఉంటాయన్నారు.
మూడు రోజుల దర్శనాల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు చెప్పారు. టీటీడీ రెండంచెల తనిఖీనీ పాటిస్తోంది. నిన్న 18,609 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.
కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
వేములవాడ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ద్వారక తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీపాల కాంతుల్లో భద్రాచలం దేవాలయం వెలిగిపోతోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!







