దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- December 30, 2025
దుబాయ్: 2026 నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ సిద్ధమవుతోంది. నివాసితులు, పర్యాటకులను ఫైర్ వర్క్స్ మరియు డ్రోన్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ మునిసిపాలిటీ డిసెంబర్ 31 మరియు జనవరి 1న పబ్లిక్ పార్కులతోపాటు ఎంటర్ టైన్ మెంట్ సౌకర్యాల పని వేళలను పొడిగించింది.
అల్ సఫా మరియు జబీల్ పార్క్ ఉదయం 8 నుండి తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుంది. క్రీక్ పార్క్ మరియు ముష్రిఫ్ నేషనల్ పార్క్ ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఇక అల్ మమ్జర్ పార్క్ ఉదయం 6 నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. చిల్డ్రన్స్ సిటీ ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు, రెసిడెన్సీ పార్కులు మరియు ప్లాజాలు ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు అనుమతిస్తారు.
ఖురాన్ పార్క్ ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు, గుహ మరియు గ్లాస్ హౌస్ ఉదయం 9 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్ ఉదయం 8 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. లేక్ పార్కులు డిసెంబర్ 31న ఉదయం 8 నుండి తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుంది.
వీటితోపాటు లీమ్ లేక్ పార్క్ - హట్టా, అల్ వాడి పార్క్ - హట్టా, ఘదీర్ అల్ తైర్ పాండ్ పార్క్, అల్ బర్షా పాండ్ పార్క్, అల్ త్వార్ పాండ్ పార్క్, అల్ నహ్దా పాండ్ పార్క్, అల్ ఖవానీజ్ పాండ్ పార్క్, అల్ వార్కా థర్డ్ పార్క్ 1, ఉమ్ సుఖీమ్ పార్క్, అల్ ఖజాన్ పార్క్, అల్ సత్వా పార్క్, అల్ ఖుజ్ పార్క్ 1 పనివేళలను పొడింగించారు.
తాజా వార్తలు
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు







