ఫేక్ CPA వెబ్‌సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- December 30, 2025
మస్కట్: కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్‌ను పోలిఉండేలా నకిలీ వెబ్ సైట్ మోసపూరిత కార్యకలాపాల గురించి రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారిక ప్లాట్‌ఫామ్ లో కంటెంట్ కు దగ్గరగా పోలిఉండే నకిలీ వెబ్‌సైట్‌ను ఉపయోగించి, మోసాలు పెరుగుతున్నట్లు గమనించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ పేర్కొంది.
బహుమతుల పేరిట బాధితులను ఆకర్షిస్తారని, ఆ తర్వాత వారి వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది వారి ఖాతాల నుండి నిధులను ఉపసంహరించుకుంటారుని తెలిపారు. ఏదైనా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని నమోదు చేసే ముందు వెబ్‌సైట్‌ల ప్రామాణికతను ధృవీకరించుకోవాలని సూచించారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తన సేవలను అందించేటప్పుడు బ్యాంక్ కార్డ్ వివరాలను అడగదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు ఏదైనా అనుమానిత మోసపూరిత కార్యకలాపాలను సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్‌సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు







