అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- December 30, 2025
రియాద్: యెమెన్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి, తూర్పు యెమెన్‌లోని సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ దళాలకు మద్దతుగా వచ్చిన రెండు నౌకలను సౌదీ అధికారులు అడ్డగించారు. అనుమతి లేకుండా ముకల్లా ఓడరేవులో దించిన ఆయుధాలు మరియు యుద్ధ వాహనాలను సీజ్ చేసినట్లు సంకీర్ణ ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్-మాలికి తెలిపారు.
ఈ రెండు నౌకలు డిసెంబర్ 27-28 తేదీలలో ఫుజైరా ఓడరేవు నుండి సంకీర్ణం జైంట్ ఫోర్సెస్ కమాండ్ అధికారిక అనుమతి పొందకుండా వచ్చాయని తెలిపారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు , సైనిక వాహనాలను దించేందుకు ముందు సిబ్బంది నౌకల ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేశారని ఆయన తెలిపారు. ఈ సరుకు తూర్పు యెమెన్‌లోని హద్రామౌత్ మరియు అల్-మహ్రా గవర్నరేట్లలో సంఘర్షణను పెంచడానికి ఉద్దేశించబడింది. ఇది ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..







