తొమ్మిదేళ్ళ తర్వాత స్వదేశానికి వలసదారుడి పయనం

- July 27, 2016 , by Maagulf
తొమ్మిదేళ్ళ తర్వాత స్వదేశానికి వలసదారుడి పయనం

భారతీయ వలసదారుడు, తొమ్మిదేళ్ళ తర్వాత లీగల్‌ ఇబ్బందుల్ని దాటుకుని, స్వదేశానికి పయనమయ్యాడు. పి నాయర్‌ అనే వ్యక్తి కేరళ నుంచి వలస వచ్చాడు. అయితే బ్యాంకు లోన్లను తిరిగి చెల్లించలేకపోవడం, క్రెడిట్‌ కార్డు బిల్లుల్ని చెల్లించకపోవడం సహా సరైన రెసిడెన్స్‌ పర్మిట్‌ లేకపోవడం వంటి కేసుల్లో ఇరుక్కుని, స్వదేశానికి వెళ్ళలేక తొమ్మిదేళ్ళుగా ఇబ్బందులు పడ్డాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నాయర్‌కి ఖతార్‌ ఛారిటీ ఆర్థిక సహాయాన్ని అందించింది. 2014 రమదాన్‌ సమయంలో బ్యాంకు ఇచ్చిన ఆఫర్‌తో 75000 ఖతార్‌ రియాల్స్‌ చెల్లించాల్సి ఉన్న నాయర్‌, 25,000 ఖతారీ రియాల్స్‌ సింగిల్‌ పేమెంట్‌లో చెల్లించి సెటిల్‌ చేసుకున్నాడు. ఇండియాకి చెందిన రవి పిల్లయ్‌ అనే ఇండస్ట్రియలిస్ట్‌ సమా పలువురు నాయర్‌ని అన్ని విధాలా ఆదుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అధికారులు కూడా అతనికి కేసుల నుంచి ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో, నాయర్‌ స్వదేశానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇండియాకి వెళుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని నాయర్‌ చెమర్చిన కళ్ళతో చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com