కువైట్ జియోపార్క్ జనవరి 7 నుండి ప్రారంభం..!!

- January 04, 2026 , by Maagulf
కువైట్ జియోపార్క్ జనవరి 7 నుండి ప్రారంభం..!!

కువైట్: కొత్తగా ప్రారంభించిన కువైట్ జియోపార్క్‌ను జనవరి 7 నుండి ప్రారంభించనున్నారు. సందర్శకులు జనవరి 4 నుండి విజిట్ కువైట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తర కువైట్ బేలో ఉంది.  సమాచార మరియు సాంస్కృతిక శాఖ మంత్రి, యువజన వ్యవహారాల రాష్ట్ర మంత్రి అబ్దుల్‌ రహమాన్ అల్-ముతైరి ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ వారం చివర్లో ప్రజల కోసం అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం జియోపార్క్ పనులు వేగంగా నడుస్తున్నాయని తెలిపారు.  తాము కేవలం విద్యాపరమైన అంశానికే పరిమితం కాకుండా, పర్యాటక రంగాన్ని పునరుజ్జీవింపజేయడంలో కూడా గణనీయంగా తోడ్పడుతున్నామని అల్-ముతైరి అన్నారు.   

ఈ ప్రాజెక్ట్ సహజ పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భూ శాస్త్రాలపై అవగాహన పెంచడం, పరిశోధనలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. జియోపార్క్ మొదటి దశ 20 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా, రెండవ దశ 1,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉంటుందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com