సౌదీ పోర్టులలో 7 రోజుల్లో 969 స్మగ్లింగ్ కేసులు నమోదు..!!

- January 04, 2026 , by Maagulf
సౌదీ పోర్టులలో 7 రోజుల్లో 969 స్మగ్లింగ్ కేసులు నమోదు..!!

రియాద్: సౌదీ అరేబియా లో గడిచిన 7 రోజుల్లో పోర్టులలో 969 స్మగ్లింగ్ కేసులను కస్టమ్స్ నమోదు చేసింది. ఈ మేరకు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో 69 రకాల మాదక ద్రవ్యాలు, 448 రకాల నిషేధిత పదార్థాలు, 1,936 రకాల పొగాకు మరియు దాని ఉత్పత్తులు, 5 రకాల ఆర్థిక వస్తువులు మరియు 12 రకాల ఆయుధాలు మరియు సంబంధిత సామగ్రి ఉన్నాయని పేర్కొంది.

సమాజాన్ని మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంలో పాలుపంచుకోవాలని అథారిటీ ప్రజలను కోరింది. ఇందుకోసం 1910 అనే భద్రతా రిపోర్టింగ్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది. వివరాలను గోప్యంగా పెడతామని హామీ ఇచ్చారు.  సరైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com