బహ్రెయిన్ లో డెలివరీ బైక్‌లపై నిషేధం..!!
- January 05, 2026
మనామా: బహ్రెయిన్ లో డెలివరీ బైక్‌లపై నిషేధం విధించాలన్న డిమాండ్లు క్రమంగా పెరుతున్నాయి. ఈ ఇష్యూకు సంబంధించిన అంశం మంగళవారం పార్లమెంటు ముందుకు చర్చకు రానుంది. ట్రాఫిక్ వయోలేషన్స్ పెరగడంపై ఎంపీలు బాదర్ అల్ తమీమి, అబ్దుల్వాహిద్ ఖరాటా, అలీ అల్ దోసేరి, హమద్ అల్ డోయ్ మరియు అబ్దుల్లా అల్ రుమైహ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వేగంగా వెళ్లే క్రమంలో డెలివరీ రైడర్లు తరచూ ట్రాఫిక్ వయోలేషన్స్ కు పాల్పడుతున్నారని వారు తెలిపారు. డెలివరీ రైడర్లకు అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి ఉల్లంఘనలను తగ్గంచవచ్చని వారు సూచిస్తున్నారు.
మరోవైపు, డెలివరీ రైడర్ల ఉల్లంఘనలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ తెలిపింది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఉల్లంఘనలకు పాల్పడిన 1,005 డెలివరీ మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా, ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి త్వరలోనే 500 స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు డైరేక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!
- యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!







